దేశంలోని 10 కోట్ల మందికి పైగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ(Indian PM Narendra Modi) ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kishan) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ పథకంలో భాగంగా రైతుల (Farmers) కు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6,000 కేంద్రంఇస్తోంది. 

ఇప్పటి వరకు 11 వాయిదాల చొప్పున డబ్బులను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్అకౌంట్లలో జమ చేసింది.

 ఈ క్రమంలోనే త్వరలో 12వ విడత డబ్బులనూ ప్రభుత్వం అందజేయనుంది. ఈ డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

కేంద్రం ఈ రూ.6,000 పెట్టుబడిని మూడు వాయిదాల్లో అందిస్తుంది.

నాలుగు నెలల తేడాతో రూ.2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు నగదు అందిస్తుంది.

ఈ డబ్బులు నేరుగా (Direct Benefit Transfer- DBT) రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమవుతున్నాయి.

అమౌంట్ విడుదలకు సంబంధించిన సన్నాహకాలు పూర్తయినట్లు తెలుస్తోంది.

మరో రెండు వారాల్లో రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు.

12 ನೇ ಕಂತಿನ ಕುರಿತು ಇನ್ನಷ್ಟು ತಿಳಿದುಕೊಳ್ಳಲು ಕೆಳಗಿನ ಲಿಂಕ್ ಅನ್ನು ಕ್ಲಿಕ್ ಮಾಡಿ